
న్యూఢిల్లీ: అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) దివాలా విధానం ద్వారా విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ (వీఐపీఎల్)కు చెందిన 600 మెగావాట్ల ప్లాంట్‌ను కొనుగోలు చేసినట్లు మంగళవారం (జులై 08) ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 4,000 కోట్లని వెల్లడించింది.
ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) జూన్ 18, 2025న వీఐపీఎల్ కోసం అదానీ పవర్ సమర్పించిన రిజల్యూషన్ ప్లాన్‌ను ఆమోదించింది. ఈ కొనుగోలుతో అదానీ పవర్ ఆపరేటింగ్ సామర్థ్యం 18,150 మెగావాట్లకు చేరుకుంది.
వీఐపీఎల్కు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని బుటిబోరిలో 600 మెగావాట్ల దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఉంది. కంపెనీ 2029-–30 నాటికి 30,670 మెగావాట్ల సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీఎల్ బ్రౌన్‌ఫీల్డ్, గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ద్వారా తన బేస్-లోడ్ విద్యుత్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను పెంచుతోంది.