
న్యూఢిల్లీ: వంట నూనెలు తయారు చేసే అదానీ విల్మార్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ.79 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ధరలు తగ్గడం వల్లే నష్టాలు వచ్చాయని కంపెనీ ప్రకటించింది. అదానీ విల్మార్ 2022 జూన్ క్వార్టర్లో రూ.194 కోట్ల లాభం సంపాదించింది. ఇదే కాలంలో మొత్తం ఆదాయం 12 శాతం తగ్గి రూ.12,928 కోట్లు తగ్గింది. గత జూన్‌లో దీనికి రూ.14,724 కోట్లు వచ్చాయి. జూన్ క్వార్టర్లో అమ్మకాలు 25 శాతం పెరిగి 14.9 లక్షల టన్నులకు చేరుకున్నాయ కంపెనీ తెలిపింది.