ఓయూలో రాహుల్ సభను ఎవరూ అడ్డుకోలేరు

ఓయూలో రాహుల్ సభను ఎవరూ అడ్డుకోలేరు

ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్ గాంధీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం, ఎన్ఎస్ యూఐ నేతలను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలు పరిశీలించడానికే రాహుల్ ఓయూలో యువ గర్జన పేరుతో సభను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ డొల్లతనం బయటపడుతుందన్న అభద్రతాభావంతోనే రాహుల్ పర్యటనను టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. యూనివర్శిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కనీసం బోధను చెప్పే అధ్యాపకులు కూడా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ సభను ఏర్పాటు చేస్తే, సభకు అనుమతి నిరాకరిస్తూ ఉస్మానియా యూనివర్శిటీ  వీసీ రవీందర్ ప్రకటన చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించి అనుమతులు తీసుకుని, ఓయూలో రాహుల్ పర్యటన సాగేలా చూస్తామని తెలిపారు.  యూనివర్శిటీ అభివృద్ధి కోసం అధికారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తల కోసం..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై భూ కబ్జా ఆరోపణలు

ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పిన బాలకృష్ణ