కేటీఆర్ ఎంత అరిచినా బీఆర్ఎస్ను నమ్మరు : అద్దంకి దయాకర్

కేటీఆర్ ఎంత అరిచినా  బీఆర్ఎస్ను నమ్మరు : అద్దంకి దయాకర్
  • అద్దంకి దయాకర్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: కవిత ప్రశ్నలకు జవాబివ్వలేని కేటీఆర్.. గద్వాలలో తొడగొట్టి మాట్లాడడమేంటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. శనివారం ఆయన హైదరాబాద్‌‌లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ గొంతు చించుకొని అరిచినా, బట్టలు విప్పుకున్నా... బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 39 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను, 16 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నప్పుడు కేటీఆర్ మొగతనం ఎటుపోయిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మొగోడు, దమ్మున్నోడు కాబట్టే.. తొడగొట్టి కేసీఆర్ ను ఓడించి, ఫామ్ హౌజ్‌‌కు పంపించారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని మండిపడ్డారు.