అడిషనల్ కలెక్టర్లు గ్రామ నిద్ర చేయాలి

అడిషనల్ కలెక్టర్లు గ్రామ నిద్ర చేయాలి

ప్రతి గ్రామసభకు అడిషనల్ కలెక్టర్, ఎంపీడీఓలు హాజరు కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అడిషనల్ కలెక్టర్లు నెలలో కొన్ని రోజులు గ్రామ నిద్ర చేయాలని ఆయన అన్నారు. హన్మకొండలోని రూరల్ జిల్లా కలెక్టరేట్ నుంచి హరితహారం కార్యక్రమంపై అన్ని జిల్లా కలెక్టర్టలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. 

‘రోడ్లకు ఇరువైలా ఉన్న మొక్కలను కాపాడుకోవడానికి మండల, గ్రామ స్థాయిలో ప్రణాళిక రూపొందించాలి. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లను  నాటాలి. గ్రామాల్లో పారిశ్యుద్దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పది రోజుల్లో వైకుంఠదామాలలో అన్నీ సదుపాయాల కల్పన పూర్తికావాలి. ప్రతి గ్రామసభకు అడిషనల్ కలెక్టర్, ఎంపీడీఓలు హాజరు కావాలి. నెలలో కొన్ని రోజులు అడిషనల్ కలెక్టర్లు గ్రామ నిద్ర చేయాలి. ఉదయాన్నే  గ్రామంలో తిరిగి పరిశుభ్రత, గ్రీనరీ మొదలైన విషయాలు గమనించి.. సమస్య లు ఉంటే అక్కడే తీర్చాలి. గ్రామాల్లోని  వినియోగంలో లేని బోర్లు, బావులు పూడ్చి వేయాలి. ప్లాంటేషన్ కార్యక్రమం సజావుగా జరగాలి. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సీఎం పర్యటన ఎప్పుడు, ఏ జిల్లాలో ఉంటుందో తెలియదు. కాబట్టి అన్ని గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా ఉండాలి. కేంద్ర, రాష్ట్రాల నుంచి ఎన్నో అవార్డులు వచ్చాయి. అదే క్రమంలో అభివృద్ధిని కొనసాగించాలి. గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా ప్రతి రోజూ తడి, పొడి చెత్తను డంప్  యార్డ్‌కి తరలించాలి’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.