SRSP కెనాల్ లో గల్లంతైన జంట.. ఇంకా లభించని ఆచూకీ

SRSP కెనాల్ లో గల్లంతైన జంట.. ఇంకా లభించని ఆచూకీ

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో SRSP కెనాల్ లో గల్లంతైన లావణ్య, అంకుష్ ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు కోరుట్ల సీఐ సురేష్ బాబు. గురువారం ( మార్చి 26 ) గల్లంతైన జంట కోసం పోలీసు బృందాలతో పాటు కుటుంబసభ్యులు కూడా గాలిస్తున్నారు. యువతీయువకులు గల్లంతై 24 గంటలు దాటుతున్నా ఇంకా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబసభ్యులు.

కోరుట్ల, మేడిపల్లి, జగిత్యాల మండలాల్లో ఉన్న SRSP కెనాల్ లో గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. కెనాల్ లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు పోలీసులు. మెట్‌‌‌‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన బొదాసు లావణ్య, మెట్‌‌‌‌పల్లికి చెందిన అంకుశ్‌‌‌‌ కలిసి బైక్‌‌‌‌పై వచ్చినట్లు గుర్తించారు పోలీసులు.

ALSO READ : కరోనా కొత్త వేరియంట్ 'సికాడా' (BA.3.2): ప్రపంచానికి ముప్పు ? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ?

లావణ్య బైక్‌‌‌‌ నడుపుతుండగా అంకుశ్‌‌‌‌ వెనుక కూర్చున్నట్లు తెలిసింది. యువతి బైక్‌‌‌‌ నడుపుతూ కాల్వ వద్దకు రాగానే అదుపుతప్పి నీటిలో పడిపోయినట్లు భావిస్తున్నారు. లావణ్య, అంకుష్ గల్లంతై 24 గంటలు దాటుతున్నా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబసభ్యులు.