ఇగ భరతం పట్టుడే: హైడ్రాకు 18 మంది ఇన్‌‌‌‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు

ఇగ భరతం పట్టుడే: హైడ్రాకు 18 మంది ఇన్‌‌‌‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు
  • డిప్యూటేషన్‌‌‌‌పై నియమించిన ఏడీజీ మహేశ్​ భగవత్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చెరువులు, కుంటల్లోని బఫర్​జోన్లు, ఎఫ్​టీఎల్​లోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత బలోపేతం కానున్నది. కమిషనర్ రంగనాథ్‌‌‌‌ నేతృత్వంలో పనిచేసేందుకు 23 మంది పోలీసులు విధుల్లో చేరనున్నారు. ఇందుకు గాను 18 మంది ఇన్‌‌‌‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలను హైడ్రాకు కేటాయిస్తూ అడిషనల్ డీజీ మహేశ్​ భగవత్‌‌‌‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 హైదరాబాద్‌‌‌‌, రాచకొండ, సైబరాబాద్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌ కమిషనరేట్స్‌‌‌‌, మెదక్ జిల్లాకు చెందిన ఇన్‌‌‌‌స్పెక్టర్లు, రిజర్వ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్లు, ఎస్సైలను డిప్యూటేషన్‌‌‌‌పై నియమించారు. వీరంతా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో విధులు నిర్వహించనున్నారు. ఆక్రమణల కూల్చివేతల సమయంలో అవసరమైన భద్రతా చర్యలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించనున్నారు.