ఆచారం.. సంప్రదాయం.. పటేల్ పొలంలో పల్లె శ్రమదానం.. ఆదివాసీలు వెట్టి పండుగ సంబరాలు

ఆచారం.. సంప్రదాయం.. పటేల్ పొలంలో పల్లె శ్రమదానం.. ఆదివాసీలు వెట్టి పండుగ సంబరాలు

ఆధునిక ప్రపంచంలో ఆచార సంప్రదాయాలు మరుగున పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఆదివాసీలు తమ ఐక్యతను, సంస్కృతిని చాటుతున్నారు. ఇందుకు ఆదిలాబాద్  జిల్లా రాముగూడ ఆదివాసీ గూడెంలో జరిగిన వెట్టి పండుగే నిదర్శనం. 

ఏడాదంతా తమకు అండగా ఉంటూ సేవలు అందించే గ్రామ పటేల్  ఆత్రం శేషరావు పొలంలో ఆదివారం కొలాం గిరిజనులు పని చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఇలా కృతజ్ఞతను చాటుకోవడమే వెట్టి పండుగ ఉద్దేశం. 

గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ వచ్చి పటేల్  చేనులో కలుపు తీస్తారు. అనంతరం అందరూ కలిసి ప్రత్యేక పూజలు చేసి సామూహిక భోజనాలు చేశారు. ఆడుతూ, పాడుతూ సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకొని పటేల్​కు ధన్యవాదాలు తెలిపారు.