V6 News

ఎంగేజింగ్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ఆదిపినిశెట్టి డ్రైవ్.. ఆసక్తికరంగా ట్రైలర్

ఎంగేజింగ్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ఆదిపినిశెట్టి డ్రైవ్.. ఆసక్తికరంగా ట్రైలర్

ఆది పినిశెట్టి హీరోగా నటించిన  చిత్రం ‘డ్రైవ్’. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్. జెనూస్ మొహమద్ దర్శకుడు.  భవ్య క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.  మంగళవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  

సౌతిండియాలో పేరున్న ఓ మీడియా సంస్థ అధిపతి జే (ఆది పినిశెట్టి).. తన ఫియాన్సీ (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్‌‌‌‌లో స్థిరపడే ప్లాన్‌‌‌‌లో ఉంటాడు. అతను ఓ డ్రైవ్‌‌‌‌లో ఉండగా తన సంస్థ అకౌంట్స్‌‌‌‌ను ఒకరు హ్యాక్ చేసి, ఫోన్ చేస్తారు. జే పరువు, మర్యాదలను టార్గెట్ చేస్తూ తన మీడియా సంస్థకు సంబంధించిన విషయాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పెడుతుంటాడు ఆ హ్యాకర్.   

మరోవైపు అతని ప్రతి కదలికలను గమనిస్తూ బెదిరిస్తుంటాడు.  తన వ్యక్తిగత,  వృత్తిపరమైన జీవితంతో ఆడుకుంటున్న ఆ హ్యాకర్‌‌‌‌‌‌‌‌ ఆట కట్టించేందుకు జే ఏం చేశాడు.. ఆ హ్యాకర్ ఎవరు, ఎందుకు టార్గెట్ చేశాడు అనేది మిగతా కథ. రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీశ్ కురువిల్లా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  యాక్షన్, ఎమోషన్‌‌‌‌, థ్రిల్లింగ్ అంశాలతో కట్ చేసిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌ ఆసక్తికరంగా ఉంది. ఈనెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.