సూర్యుడి సమీపంలోకి ఆదిత్య ఎల్ 1 నాలుగో భూకక్ష్య పెంపు సక్సెస్

సూర్యుడి సమీపంలోకి ఆదిత్య ఎల్ 1 నాలుగో భూకక్ష్య పెంపు సక్సెస్

సూర్యుడి గురించి పరిశోధించడానికి బయలుదేరిన ఆదిత్య ఎల్1 మరో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహానికి నాలుగోసారి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని ఇస్రో విజయవంతంగా చేపట్టింది.   బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ ఆపరేషన్‌ను ఇస్రో నిర్వహించింది. మారిషస్‌, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్‌ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. 

ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహానికి నాలుగోసారి భూ కక్ష్య పెంపు విన్యాసంతో ఉపగ్రహం 256 km x 121973 km కక్ష్యలోకి ప్రవేశించిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.  తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 19వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించారు. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్‌-1 పాయింట్‌ను చేరుకోవాలంటే ఆదిత్య ఎల్‌-1కు నాలుగు నెలలు పడుతుందని వివరించారు.

Also Read :- ప్రతి సిటీలో ఆటో డంపింగ్ యార్డులు ఓపెన్ చేయండి : కేంద్రం అలర్ట్

సూర్యుడి రహస్యాలను తెలుసుకోవడానికి ఇస్రో సెప్టెంబర్ 2 న ఆదిత్య L-1 అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది.  ఇది నాలుగు నెలలు ప్రయాణించి  భూమి, సూర్యుని మధ్య ఉన్న లాంగ్రెస్ పాయింట్‌కి L1కి వెళ్తుంది. ఇప్పటి వరకు ఆదిత్య ఎల్ 1 భూమి చుట్టూ నాలుగు కక్ష్యలను పూర్తి చేసింది. ఆదిత్య ఎల్ 1 భూమి నాల్గవ కక్ష్యలోకి ఇంజెక్ట్ చేయబడింది.

ఆదిత్య L-1 భూమి ఐదు కక్ష్యలను ప్రదక్షిణ చేసిన తర్వాత భూమి గురుత్వాకర్షణ క్షేత్రం నుండి నిష్క్రమిస్తుంది. దీని తర్వాత అది L1 వైపు వెళ్లనుంది. ఈ ప్రక్రియను క్రూయిజ్ స్టెప్ అంటారు. దీనిలో ఇది తన ప్రయాణాన్ని సులభంగా పూర్తి చేస్తుంది. ఇక్కడి నుంచి దాదాపు 110 రోజుల పాటు ప్రయాణించిన తర్వాత ఎల్1 పాయింట్‌కి వెళ్లి అక్కడ హలో ఆర్బిట్‌లో ఏర్పాటు చేస్తుంది.