కోవిడ్ వల్ల ఆ సినిమాలు చూడలేకపోతున్నా 

కోవిడ్ వల్ల ఆ సినిమాలు చూడలేకపోతున్నా 

ఇవాళ కల్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ సీతారామం చిత్రాలు థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. నా మిత్రులు కల్యాణ్ రామ్ నటించిన బింబిసార, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. రెండు సినిమాలు చూడవల్సిందిగా అభిమానులను కోరుతున్నాను అన్నారు. ఇది కదా కావల్సింది.

కోవిడ్ వచ్చి ఐసోలేషన్ లో ఉన్నాను.. ఈ రెండు సినిమాలను మార్నింగ్ షో ఒకటి, మ్యాట్నీ ఒకటి నా కోసం కుమ్మేయండి అని అడవి శేష్ ట్వీట్ లో తెలిపాడు. ఇక మేజర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన హిట్ 2 సినిమా నటిస్తున్నాడు. ప్రస్తుతం అడవి శేష్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ కు వెళ్లనున్నాడు. కాగా, కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.