
- ఒకటి, రెండు రోజుల్లో జాయిన్చేయనున్న అధికారులు
- ఇష్టాన్ని బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించనున్న విద్యాశాఖ
హైదరాబాద్ సిటీ, వెలుగు : మూసీ రివర్బెడ్ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోంది. డబుల్బెడ్రూం ఇండ్లకు తరలిన మూసీ రివర్బెడ్నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి పిల్లల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా సమీప స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పిస్తామని చెప్పింది. అన్నట్టుగానే డబుల్ బెడ్రూం ఇండ్లకు తరలిన కుటుంబాలలోని చదువుకునే పిల్లలను సమీప ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ స్కూళ్లలో జాయిన్ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 227 మూసీ రివర్బెడ్ కుటుంబాలు డబుల్ఇండ్లకు తరలగా, ఇందులో ఎక్కువ శాతం మలక్‌పేటలోని పిల్లి గుడిసెలు, జియాగూడాలోని డబుల్ఇండ్లకు వెళ్లారు. ఈ రెండు ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారులు పిల్లిగుడిసెల్లో 132 మంది, జియాగూడలో 37 మంది స్కూల్స్టూడెంట్స్ఉన్నారని గుర్తించారు. స్టూడెంట్స్ఇష్టం మేరకు వీరిని డబుల్ఇండ్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒకటి, రెండు రోజుల్లో జాయిన్ చేయనున్నారు. కాగా, ప్రభుత్వం ఇప్పటికే మూసీ రివర్బెడ్ నిర్వాసితులకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వడంతో పాటు, ఖర్చుల కోసం ప్రతీ కుటుంబానికి రూ.25 వేలు చెల్లిస్తోంది. వారి సమస్యల పరిష్కారం కోసం ఆయా జిల్లా జిల్లాల్లోని కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్స్కూడా ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ ... ఎక్కడైనా సరే..
మూసీ రివర్బెడ్ నిర్వాసితుల పిల్లలకు సమీప స్కూళ్లలో అడ్మిషన్లు పొందేలా చూడాలనే ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు...డబుల్ఇండ్లకు కిలోమీటర్‌నుంచి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను మ్యాపింగ్ ద్వారా గుర్తించారు. దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్స్కూళ్లలో కూడా గుర్తించి అడ్మిషన్లు ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రైవేట్‌స్కూల్ యాజమాన్యాలతో కూడా సంప్రదింపులు జరిపారు. అయితే, కొందరు నిర్వాసితులు మాత్రం తమ పిల్లలను పాత ప్రైవేట్ స్కూళ్లలోనే చదివించడానికి ఇంట్రెస్టు చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేట్‌స్కూళ్లకు ఫీజులు చెల్లించడం ఒక కారణమైతే, చాలా రోజుల నుంచి ఒకే స్కూల్ లో చదువుతున్నారని, కొత్త స్కూల్అయితే అలవాటు పడటానికి సమయం పడుతుందని, కొద్దిగా దూరమైనా రోజూ వెళ్లి వచ్చేలా పేరెంట్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. చాలా మంది మైనారిటీ రెసిడెన్షియల్‌స్కూల్స్, ప్రభుత్వ స్కూళ్లలో జాయిన్అవ్వడానికి, మరికొంతమంది ప్రైవేట్స్కూల్స్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, వారి ఇష్టం ప్రకారం ఆయా స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దసరా హాలీడేస్ ముగిశాయి కాబట్టి ఈ 169 మందిని ఆయా స్కూళ్లలో జాయిన్ చేస్తామని వెల్లడించారు.