వర్షాలపై రైతులకు ముందస్తు సమాచారం.. సాగు పనుల ప్రణాళికకు తోడ్పాటు.. రైతుల ఫోన్లకు మెసేజ్లు

వర్షాలపై రైతులకు ముందస్తు సమాచారం.. సాగు పనుల ప్రణాళికకు తోడ్పాటు.. రైతుల ఫోన్లకు మెసేజ్లు

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రైతులకు వానాకాల వ్యవసాయ పనుల ప్రణాళికలో తోడ్పాటును అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ‘రైతు భరోసా’ లబ్ధిదారులకు వారి మండలాల్లో ఎప్పుడు వానలు కురుస్తాయన్న సమాచారాన్ని మొబైల్ ఫోన్లకు మెసేజ్‌‌‌‌లు పంపించనున్నారు.

అయితే ఈ అంచనాలు కేవలం వర్షాలు ప్రారంభమయ్యే సమయాన్ని మాత్రమే సూచిస్తాయని, వర్షపాత పరిమాణాన్ని తెలియజేయవని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. రైతులు విత్తనాలు, ఎరువుల వినియోగం, సాగు పనుల ప్రణాళికకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. కాగా, ఈ సేవలు అవసరం లేదనుకునే రైతులు ‘స్టాప్’ అని మెసేజ్ పంపితే వీటిని నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ పేర్కొంది.