చెరువుల ఆక్రమణను పరిశీలించిన అడ్వకేట్ కమిషనర్లు : అలోక్‌ ఆరాధే

చెరువుల ఆక్రమణను పరిశీలించిన అడ్వకేట్ కమిషనర్లు :  అలోక్‌ ఆరాధే

గచ్చిబౌలి, వెలుగు:  రాష్ర్ట  హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే నియమించిన అడ్వకేట్​ కమిషనర్ల కమిటీ గురువారం శేరిలింగంపల్లి మండల పరిధిలోని చెరువులను పరిశీలించింది.  చెరువుల ఆక్రమణ, శిఖం స్థలం, చెరువుల స్థితిగతులపై అడ్వకేట్​ కమిషనర్లు నివేదికను సీల్డ్​ కవర్‌లో  హై కోర్టుకు సమర్పించనున్నారు.

  గ్రేటర్​ హైదరాబాద్‌ పరిధిలోని  పలు చెరువుల ఆక్రమణపై  ప్రభుత్వేతర ఆర్గనైజేషన్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​అనిల్​  సి. దయాకర్​ హై కోర్టులో  కంప్లైంట్​ చేశారు.  హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో  భాగంగా జీహెచ్​ఎంసీ  లిమిట్స్‌లోని 16 చెరువుల స్థితిగతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఫిబ్రవరి6 న ఆదేశాలు జారీ చేసింది.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్​ అధారే ఆదేశాల మేరకు డిప్యూటీ సొలిసిటర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా  ప్రవీణ్​కుమార్,  ప్రభుత్వ రెవెన్యూ ప్లీడర్​ టి. శ్రీకాంత్​రెడ్డిలను చెరువుల పరిశీలన కోసం నియమించింది.