నిందితులను ట్రాప్ చేసింది మేమే: హైకోర్టులో ఏజీ

నిందితులను ట్రాప్ చేసింది మేమే: హైకోర్టులో ఏజీ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముందే ఫాంహౌజ్ లో సీసీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్  ఏర్పాటు చేశారా అని  ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నిందితుల  కస్టడీని నిరాకరించిన ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈ కేసులో ఎలాంటి ఆధారాలున్నాయని ఏజీని  ప్రశ్నించింది. అంతేగాకుండా నిందితులు 24 గంటల వరకు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. నిందితులు తమ అడ్రస్ లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఇవ్వాలని సూచించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా  హై ప్రొఫెషనల్ కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ రీజెక్ట్ చేసిందని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు నిందితులు యత్నించారని  చెప్పారు. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించారన్నారు. ప్రతీ కేసులో 41ఏ సీఆర్ పీసీ  నోటీసులిచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన  లేదన్నారు.  దీనిపై స్పందించిన హైకోర్టు ఈ కేసులో ఇంకా ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామౌస్ లో ఎమ్మెల్యేలను 50 కోట్ల రూపాయల ఇస్తామని ప్రలోభ పెట్టారని ఏజీ తెలిపారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరేందుకు ఆఫర్ చేశారన్నారు. వివరాలు ముందే తెలియడంతో సీసీ కెమెరాలు,ఆడియో రికార్డింగ్ అన్నీ ఏర్పాటు చేసి నిందితులను ట్రాప్ చేశామని చెప్పారు. ఈడీ, సీబీఐ కేసుల నుంచి  కాపాడుతామని కూడా చెప్పారని ఏజీ కోర్టుకు తెలిపారు.