
హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ)అభ్యర్థులు ఆందోళన చేశారు. హలో నిరుద్యోగి-చలో గాంధీ భవన్ పేరుతో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ ఎగ్జామ్ రిజల్ట్ ను ప్రకటించి పార్లెమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే తమకు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పేపర్ లీక్ కారణంగా తాము ఎన్నో ఇబ్బందులుపడ్డాం..తర్వాత కోర్టు కేసుల పేరుతో ఆలస్యం జరిగింది. ఎగ్జామ్ రాసి ఆరు నెలలైనా టీఎస్ పీఎస్ సీ ఫలితాలు ప్రకటించడం లేదని అభ్యర్థులు తెలిపారు.
పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డికి వినతిప్రతం అందజేశారు అభ్యర్థులు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని భవానీ రెడ్డి హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు.