ODI World Cup 2023 : వీళ్లు పిల్లలేంటి సామీ : తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆఫ్ఘనిస్థాన్ అర్హత

ODI World Cup 2023 : వీళ్లు పిల్లలేంటి సామీ : తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆఫ్ఘనిస్థాన్ అర్హత

ఆఫ్ఘనిస్తాన్ జట్టు క్రికెట్ లో తమదైన ముద్ర వేసే పనిలో ఉంది. పసికూన అనే ట్యాగ్ వీడి టాప్ జట్లను ఓడిస్తుంది. 2019 వరల్డ్ కప్ లో ఆడిన 9 మ్యాచ్ లు ఓడిపోయినా ఆ జట్టు 2023 లో ఒక్క మ్యాచ్ గెలిచినా గొప్పే అనుకున్నారు. కానీ సీన్ అంతా రివర్స్. ఆడిన 7 మ్యాచ్ లో 4 మ్యాచ్ ల్లో విజయాలను సొంతం చేసుకొని సెమీస్ రేస్ లో నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లపై నెగ్గిన ఆఫ్గన్... సెమీస్ కు వెళ్లకుండానే సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించి తాము ఇకపై పసికూనలం కాదని నిరూపించే పనిలో ఉంది. 

షెడ్యూల్ ప్రకారం 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరగాల్సి ఉంది. టాప్-8 లో జట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ పాయింట్ల పట్టికలో టాప్ 7లో నిలిచిన జట్లు, నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని తెలిపింది. పాకిస్థాన్ ఆతిధ్య జట్టు కాబట్టి మొత్తం 8 జట్లతో ఈ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే 4 మ్యాచ్ ల్లో విజయాలు సాధించిన ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక కన్నా ముందంజలో ఉంది. 

ALSO READ : ODI World Cup 2023: నేను అవుట్ కాదు.. ఇదిగో ప్రూఫ్: అంపైర్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన మాథ్యూస్

ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని దాటాయి. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఈ మూడు జట్లకు నాలుగు మ్యాచుల్లో గెలిచే అవకాశం లేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి రెండు మ్యాచ్ ల్లో ఓడినా పాయింట్ల పట్టికలో టాప్-7 లో నిలుస్తుంది. ఇక ప్రస్తుతంవరల్డ్ కప్ లో ఆడిన 7 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించిన ఆఫ్ఘన్.. మరో రెండు విజయాలు సాధిస్తే ఎలాంటి సమీకరణం లేకుండా సెమీ ఫైనల్ కు వెళ్తుంది.