జ్యోతిష్యం: 18 ఏళ్ల తర్వాత రాహు, కేతువులు ఆ రాశుల్లోకి వచ్చారు.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది..?

జ్యోతిష్యం: 18 ఏళ్ల తర్వాత రాహు, కేతువులు ఆ రాశుల్లోకి వచ్చారు.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది..?

జ్యోతిష్య శాస్త్రంలో కీలక పరిణామం.. రెండు గ్రహాలు మారుతున్నాయి. అవి కూడా రాహు, కేతువులు అయిన ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాలు అని లైట్ తీసుకోవాల్సిన సమయం, సందర్భం కాదు ఇది. 18 ఏళ్ల తర్వాత.. రాహు, కేతువులు 2025, మే 18వ తేదీ సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు.. రాహువు కుంభ రాశిలోకి, కేతువు సింహ రాశిలోకి వచ్చారు. 18 ఏళ్ల తర్వాత ఈ రాశుల్లోకి రాహు కేతవులు రావటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకుందాం..

మేష రాశి : రాహు కేతువు మార్పుల వల్ల మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తెలియని శక్తి మిమ్మల్ని మందుకు నడిపిస్తుంది. మీపై మీరు ఎక్కువగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగ, వ్యాపారంపై దృష్టి పెడతారు. కొత్త అవకాశాలు వస్తాయి. మీలోని మార్పులు మీ కుటుంబంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, ఇతర బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. సంయమనం పాటించండి. అంతా మంచే జరుగుతుంది. 

వృషభ రాశి : రాహు, కేతు ప్రభావంతో మీరు దూర ప్రయాణాలు చేయొచ్చు.. కుటుంబానికి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు సొంతంగా ఆఫీస్ నిర్వహిస్తున్నా.. వ్యాపారం చేస్తున్నట్లు అయితే మీకు మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఇది మీకు కలిసి వచ్చే సమయం కూడానూ.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

మిథున రాశి : జీవితంలో స్థిర పడాలనే కోరిక బలంగా ఉంటుంది. బాగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తారు. మీ లక్ష్యాలను సాధించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇలాంటి ఆలోచనలతో.. ఆ ప్రభావం మీ కుటుంబం, సంబంధాలు, బంధాలపై ప్రభావం చూపిస్తుంది. చదువుకుంటున్న విద్యార్థులు, విద్యా రంగంలోని వ్యక్తులకు పలు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. 

కర్కాటక రాశి : రాహు కేతువులు కుంభ, సింహ రాశిలోకి ప్రశేశించటం వల్ల.. కర్కాటక రాశి వారు.. వారి వారి రంగాలపై విపరీతమైన శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగం, వ్యాపారం చేస్తు్న్నట్లయితే దానిపై ఏకాగ్రత పెరగటమే కాకుండా ఏదో సాధించాలనే తపనతో నిరంతరం అదే ఆలోచనతో ఉంటారు. దీని వల్ల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్నాయి. 

సింహ రాశి : ఈ రాశి వారు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లయితే.. ఇదే మంచి సమయం అని గ్రహాలు చెబుతున్నాయి. గట్టి ప్రయత్నాలు చేస్తే మీ విదేశీ కల నెరవేసే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి విపరీతంగా పెరిగే సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆలయ దర్శనాలు ఉన్నాయి. అంతా బాగున్నా.. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని గ్రహాలు చెబుతున్నాయి. 

కన్య  రాశి : రాహు, కేతువుల ప్రభావం వల్ల చెడు అలవాట్లకు దగ్గర అయ్యే ప్రమాదం ఉంది. చెడు వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మద్యం తాగి వాహనాలు నడపటం వంటి వాటికి దూరంగా ఉండండి. గొంతు సంబంధమైన అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారంలో పెద్దగా మార్పులు లేకపోయినా.. అనారోగ్య విషయాలపై మిమ్మల్ని ఈ సమయంలో బాధించొచ్చు అని గ్రహాలు సూచిస్తున్నారు.. అప్రమత్తంగా ఉండాలి. 

తులా రాశి : రాహు, కేతవుల మార్పు వల్ల తులా రాశి వారిలో కొత్త ఆలోచనలు రాబోతున్నట్లు గ్రహాలు సూచిస్తున్నాయి. మీ కంటే.. మీ కుటుంబం కంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచన చేసే అవకాశం ఉంది. స్నేహితులు, మీ బంధువుల గురించి అతిగా ఆలోచన చేయటం వల్ల.. కుటుంబంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. మీ కోసం కంటే ఇతరుల కోసం ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితులు సూచిస్తున్నాయి. ఇతరులకు సాయం చేయాలని.. వారి కోసం మీరు తపిస్తున్నట్లు గ్రహాలు సూచిస్తున్నాయి. సంయమనం పాటించాలి. 

వృశ్చిక రాశి : రాహు కేతువుల మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్నాళ్లుగా.. అంటే దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే సూచనలు ఉన్నాయి. మీకు అనుకూలంగా పరిస్థితులు రాబోతున్నాయనేది గ్రహాలు సూచిస్తున్నాయి. 12వ ఇంట్లో కేతువు సంచారం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది. దైవ దర్శనం, ఆలయాలకు వెళ్లటం, పూజలు చేయటం వంటి సూచిస్తున్నాయి. సమయం మీకు అనుకూలంగా ఉండటంతో.. ఎంతో కాలంగా మీరు అనుకుంటున్న ఓ ముఖ్యమైన పని కూడా మీకు అనుకూలంగా జరిగే అవకాశం కూడా ఉంది. 

ధనుస్సు రాశి : సంగీతం, కళలు, సినీ రంగంలో ఉండే వాళ్లకు ఇది అద్భుతమైన కాలంగా మారే అవకాశం ఉంది. రాహు కేతువుల మార్పు వల్ల.. విద్యా రంగంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని గ్రహాలు సూచిస్తున్నాయి. ధనుస్సు రాశికి చెందిన గర్బిణి స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహాలు. కళా రంగంలో వారికి మంచిగా ఉన్నా.. మిగతా రంగాల్లో పని చేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండల్సిన సమయంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. 

మకర రాశి : ఈ రాశి వారికి రాహు కేతువుల ప్రభావం వల్ల సుఖాలపై మరింత మోజు పెరుగుతుంది. భౌతిక సుఖాల కోసం వెంపర్లాడే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినొచ్చు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. దీని వల్ల భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని గ్రహాలు సూచిస్తున్నాయి. ఏది మంచి.. ఏది తప్పు అనే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని గ్రహాలు సూచిస్తున్నాయి. 

కుంభ రాశి : రాహు, కేతువుల ప్రభావం వల్ల.. కుంభ రాశి వారిలో ఆత్మ విశ్వాసం బాగా పెరుగుతుంది. ఏదైనా కొత్త కోర్సులు, కొత్త విషయాలను నేర్చుకోవాలి అనుకుంటే ఇది సరైన సమయం.. మంచి కాలం అని గుర్తుంచుకోండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలు అందరూ శ్రద్ధగా వింటారు. మీలోని అద్భుతమైన ప్రతిభ బయటకు వచ్చే సమయం ఆసన్నమైందని గ్రహాలు చెబుతున్నాయి. పెండింగ్ పనులు ఉన్నా ఈ కాలంలో పూర్తి చేయవచ్చు. కమ్యునికేషన్ రంగంలో ఉండే వాళ్లకు అద్బుత కాలంగా చెబుతున్నాయి పరిస్థితులు. 

మీన రాశి : రాహు, కేతువు మార్పు వల్ల.. మీన రాశి వాళ్లు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వొద్దు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ పరపతికి, ఇమేజ్ కు నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అతిగా తినటం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రతి విషయంలో అప్రమత్తంగా.. నిదానంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తొందరపాటు పనికి రాదు. 

నోట్ : రాహువు కుంభ రాశిలో 18 నెలలు.. అదే విధంగా కేతువు సింహ రాశిలో 18 నెలలు ఉండనున్నారు. ఈ సమయ కాలంలో 12 రాశులపై గోచారం గోచారం ప్రకారం ఈ ఫలితాలు. వ్యక్తిగత జాతకం కాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పండితులు చెబుతున్న సమాచారం. సూచనలు, సలహాలు ఆధారంగా ఈ కథనం. దీనికి v6వెలుగుతో సంబంధం లేదు.