చెన్నైని కట్టడి చేసిన SRH

చెన్నైని కట్టడి చేసిన SRH

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్స్ సత్తా చాటారు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది.  బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నైను SRH కట్టడి చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (15), రుతురాజ్ గైక్వాడ్ (16) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత మొయీన్ అలీ (48), అంబటి రాయుడు (27) ఫర్వాలేదనిపించారు. శివమ్ దూబే (3), ధోనీ (3) నిరాశపరచగా..చివర్లో కెప్టెన్ రవీంద్ర జడేజా (23) మంచి షాట్లు ఆడాడు. అయితే అతన్ని భువనేశ్వర్ చివరి ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. డ్వేన్ బ్రావో (8 నాటౌట్), క్రిస్ జోర్డాన్ (6 నాటౌట్) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, మార్క్రమ్, మార్కో జాన్సెన్ తలో వికెట్ తీసుకున్నారు.