చైనాతో ముప్పు ఇంకా తొలగలేదు

 చైనాతో ముప్పు ఇంకా తొలగలేదు

న్యూఢిల్లీ: చైనాతో ఒప్పందం తర్వాతే ఈస్టర్న్ లడఖ్‌‌లో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. పలు అంశాలపై చైనాతో ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. అదే సమయంలో చైనాతో ముప్పు పూర్తిగా తొలగిందని చెప్పలేమన్నారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి పలు ఏరియాల్లో ఏ ఒక్కరి కంట్రోల్ కూడా లేదని, తమ అధీనంలో ఉన్న ఏరియాలను మాత్రం పూర్తి అధీనంలోకి తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి గ్రే ఏరియాల వల్లే మొత్తం సమస్యంతా వస్తోందన్నారు. ఎల్‌ఏసీని సరిగ్గా గుర్తించనంత వరకు ఇలాంటి సమస్యలు తలెత్తుతూనే ఉంటాయన్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల పునరుద్ధరణలో నమ్మకం చాలా కీలకమని పేర్కొన్నారు.