Polimera 2: అరుదైన గౌరవం దక్కించుకున్న పొలిమేర 2 మూవీ

Polimera 2: అరుదైన గౌరవం దక్కించుకున్న పొలిమేర 2 మూవీ

మా ఊరి పొలిమేర(Maa Oori Polimera).. 2021లో వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్(Anil Vishwanath) తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యం రాజేష్ ,కామాక్షి భాస్కర్ల ,గెటప్ శీను ,బాలాదిత్య ,రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ మ్యాజిక్, మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వల్ గా పొలిమేర 2 కూడా వచ్చిన విషయం తెలిసిందే. 

2023లో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు క్షద్రపూజలు, చేతబడి, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఊహించని ట్విస్టులతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఓటీటీలో కూడా ఈ సినిమా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. అదేంటంటే.. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఏప్రిల్ 30 ,2024 న జరగనున్న ప్రతిష్టాత్మకమైన 14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ కు ఈ సినిమా అధికారికంగా ఎంపిక చేయబడింది. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.