Allari Naresh : ఎన్టీఆర్ దేవరలో అల్లరి నరేష్..సోషల్ మీడియా రూమర్ పై క్లారిటీ!

Allari Naresh : ఎన్టీఆర్ దేవరలో అల్లరి నరేష్..సోషల్ మీడియా రూమర్ పై క్లారిటీ!

దేవర(Devara)..యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr)హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ.కొరటాల  శివ(Koratala Shiva) దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్(Saif alikhan) విలన్గా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ క్రియేషన్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. టాలీవుడ్ అల్లరోడు..అదే కామెడీ స్టార్ అల్లరి నరేష్ దేవర సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ విషయంపై అల్లరి నరేష్ స్పందించారు.

" తాను ఎన్టీఆర్ దేవర సినిమాలో ఎలాంటి పాత్ర పోషించడం లేదని..ఇలాంటి వార్తలని ఎవరూ నమ్మొద్దని ఆయన క్లారిటీ ఇచ్చారు.అయితే, ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వస్తే కచ్చితంగా ఫ్యూచర్ లో నటిస్తానని..అలాగే టాలీవుడ్ హీరోలందరిలో ఎవరితోనైనా కలిసి నటించేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నట్లు నరేష్ వెల్లడించారు.

కొంత కాలంగా వరుస సీరియస్ సబ్జెక్టులతో మెప్పిస్తున్న అల్లరి నరేష్(Allari Naresh)..తిరిగి తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నాడు.తన 61వ సినిమా అయిన ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్పడం సినిమాపై బజ్‌‌ను పెంచేలా ఉంది.ఫరియా అబ్దుల్లా (FariaAbdullah) హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.ఈ మూవీని మే 3న విడుదల చేయనున్నారు.