మరో మల్టీస్టారర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మరో మల్టీస్టారర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఎన్టీఆర్, ఏఎన్నార్ టైమ్‌‌‌‌‌‌‌‌లో మల్టీస్టారర్ సినిమాలకు సూపర్బ్ క్రేజ్ ఉండేది. తర్వాత్తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం తగ్గిపోయింది.  మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత మల్టీస్టారర్స్‌‌‌‌‌‌‌‌కి క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం వెంకటేష్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో కలిసి నటిస్తూ మరోసారి మల్టీస్టారర్స్‌‌‌‌‌‌‌‌ ట్రెండ్‌‌‌‌‌‌‌‌ని తీసుకొచ్చారాయన. ఇప్పటికే వరుణ్‌‌‌‌‌‌‌‌ తేజ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ‘ఎఫ్‌‌‌‌‌‌‌‌ 3’ చేస్తున్నాడు. ఇప్పుడు మరో హీరోతో కలిసి స్క్రీన్‌‌‌‌‌‌‌‌ షేర్ చేసుకోనున్నట్లు తెలిసింది. తమిళ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉక్రెయిన్ నటి మారియా హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. లండన్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే ఈ రొమాంటిక్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెంకటేష్ ఒక ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన ఆ సినిమాలో నటించట్లేదని, అనుదీప్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లోనే వేరే మూవీ చేయబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇంపార్టెంట్ క్యారెక్టరో, ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్ హీరో పాత్రో తెలియదు కానీ.. ఆయన అనుదీప్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో నటించనున్నారనే వార్త మాత్రం నిజమని అర్థమవుతోంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్.