ఆసక్తిరేపుతున్న ‘అగ్ని నక్షత్రం’ ఫస్ట్ గ్లింప్స్

ఆసక్తిరేపుతున్న ‘అగ్ని నక్షత్రం’ ఫస్ట్ గ్లింప్స్

మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ "అగ్ని నక్షత్రం". సముద్రఖని, విశ్వంత్‌, చిత్ర శుక్లా, మలయాళ నటుడు సిద్ధిక్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫస్టు గ్లింప్స్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ గ్లింప్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  మీడియో చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ అని అర్థం అవుతుంది. ఇందులో  ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ విశ్వామిత్ర అనే డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో మోహన్ బాబు కనిపించనున్నారు. మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. 

ఈ సినిమాను డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ తెరకెక్కిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు,లక్ష్మీ ప్రసన్నలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  డైమండ్ రత్నబాబు కథ అందించారు. మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ మూవీ కంప్లీట్ కావడానికి చివరి దశలో ఉంది.