ఈ అన్నను చూసి కుళ్లుకోకండి గురూ.. పోయిన జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో.. ఏంటో..!

ఈ అన్నను చూసి కుళ్లుకోకండి గురూ.. పోయిన జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో.. ఏంటో..!

కర్వా చౌత్. భర్త సంపూర్ణ ఆయుష్షుతో సుఖంగా ఉండాలని భార్య ఉపవాసం ఉండి వ్రతం ఆచరించే రోజు. ఈ కర్వా చౌత్ను ఉత్తరాదిన ఎక్కువగా పాటిస్తారు. ఈ రోజున, పెళ్లైన మహిళలు తమ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఆగ్రాలో ఈ కర్వా చౌత్ పాటించిన ఒక కుటుంబం ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. తమ భర్త యోగక్షేమాలను కాంక్షిస్తూ ఇద్దరు భార్యలు ఈ కర్వా చౌత్ను పాటించడమే ఇందుకు కారణం. ఈ ఒక భర్త.. ఇద్దరు భార్యల కర్వా చౌత్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.

ఆగ్రాలోని ఎత్మదుద్దౌలా ప్రాంతంలో, రామ్ బాబు అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు షీలా, మన్ను దేవిలతో కలిసి కర్వా చౌత్‌ను జరుపుకున్నాడు. తన ఇద్దరు భార్యలు కలిసి ఆచారం పాటించి.. ఉపవాసం ఉండి తమ భర్త బాగు కోరారు. కర్వా చౌత్ భర్తపై ప్రేమ, పతి భక్తికి ప్రతీక అయినప్పటికీ ఇద్దరు భార్యలను ఆశీర్వదిస్తూ రామ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్ల చూపును ఆకర్షించాయి. తన ఇద్దరు భార్యలు సాయంత్రం పూజలో కలిసి కూర్చుని, చంద్రుడికి ప్రార్థనలు చేసి, చివరిగా ఉపవాసం ముగించే సమయంలో భర్త కాళ్లు మొక్కి.. అతని చేతులతో నీళ్లు తాగుతున్న దృశ్యాలు ఆకర్షించాయి. రెండు పెళ్లిళ్లు చేసుకోవడంపై రామ్ బాబు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

రామ్ బాబు దాదాపు పది సంవత్సరాల క్రితం షీలా దేవిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. కొన్నేళ్లకు ఇతనికి మన్ను దేవితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొసమెరుపు ఏంటంటే.. వీళ్ల ప్రేమ గురించి మొదటి భార్యకు తెలిసినప్పటికీ పెద్దగా గొడవలేం కాలేదట. మొదటి భార్యను వదిలించుకుని రెండో పెళ్లి చేసుకుంటానంటే రచ్చ జరిగేది. మొదటి భార్యను, పిల్లలను చూసుకుంటూనే రెండో పెళ్లి చేసుకుంటానని రామ్ బాబు చెప్పడంతో వివాదానికి తావు లేకుండా రెండో పెళ్లి సాఫీగా జరిగింది.

►ALSO READ | బీహార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గోడలపై గుట్కా మరకలు.. ఓపెనింగ్ రోజే ఉమ్మేసి పరువు తీశారు !

తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్య పచ్చ జెండా ఊపడంతో గొడవలు జరగలేదు. మొదటి భార్య  షీలా తన భర్త రెండో పెళ్లికి ఎటువంటి అభ్యంతరం చెప్పకపోయినప్పటికీ సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనే కండీషన్ పెట్టింది. దీంతో.. రెండో భార్యను ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాడు.ప్రేమ ఉన్నచోట గొడవలకు చోటు ఉండదని తన ఇద్దరు భార్యల పతిభక్తి గురించి చెప్పి రామ్ బాబు మురిసిపోయాడు. భర్తను చంపి బ్లూ డ్రమ్ముల్లో సర్దేస్తున్న భార్యలున్న ఈరోజుల్లో భర్తపై ఇంత పతి భక్తి పెంచుకున్న ఇద్దరు భార్యలను చూస్తుంటే.. పెళ్లిపై మరోసారి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తుండటం విశేషం.