
బీహార్లో కోట్లు ఖర్చు చేసి ఫస్ట్ టైం ఆ రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కట్టారు. 40 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ ఇంంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను అక్టోబర్ 5న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అట్టహాసంగా ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అదిరిపోయే ఆర్కిటెక్చర్తో నిర్మించిన ఈ ఇంటర్నేషనల్ స్టేడియానికి అప్పుడే గుట్కా మరక అంటింది. పెయింట్ వేయకుండా వదిలేసిన ఇటుకలకు గుట్కా బ్యాచ్ గుట్కాలను నమిలి ఊసేసి ఎర్రని పెయింట్ వేసేశారు.
ఈ గుట్కా మరకలను చూసిన ఒక యువకుడు తీవ్ర ఆవేదనతో ఈ విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇంకేముంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో దెబ్బకు వైరల్ అయింది. కొత్తగా కట్టిన స్టేడియం.. పైగా బీహార్లో తొలిసారి కట్టిన ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గుట్కా బ్యాచ్ ఇలా ఇష్టారీతిన గుట్కాలు నమిలేసి ఉమ్మి వేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం పరువు తీస్తున్నారంటూ మండిపడ్డారు.
►ALSO READ | బీహార్ బరిలో MIM.. 32 చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించిన పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
ఈ గుట్కాలు నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసే దరిద్రమైన అలవాటు ఒక్క బీహార్కే పరిమితం అయింది కాదని ఇది ఇండియా మొత్తానికి సంబంధించిన విషయం అని నెటిజన్లు కొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటోళ్లు మళ్లీ మనకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో మాదిరిగా మంచి స్టేడియంలు లేవని నిందిస్తుంటారని గుట్కా బ్యాచ్పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ గుట్కాలను నమిలి ఉమ్మేయడం సిగ్గుపడాల్సిన విషయం అని, ఇలాంటి వాళ్లు దేశం పరువు తీస్తున్నారని మెజారిటీ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఇలాంటి వాళ్లు ఇకనైనా మారాలని.. చేసిన పనికి సిగ్గు తెచ్చుకుని ఇకపై ఇలాంటి దరిద్రమైన పనులు చేయడం మానుకోవాలని నెటిజన్లు హితవు పలికారు.
Biharis spit gutkha at the first international cricket stadium in Bihar on its inauguration day. 🤡 pic.twitter.com/S8MYSJYqfu
— Honest Cricket Lover (@Honest_Cric_fan) October 7, 2025