అగ్రికల్చర్ డైరెక్టర్ గోపికి అదనపు బాధ్యతలు

అగ్రికల్చర్ డైరెక్టర్ గోపికి అదనపు బాధ్యతలు
  •    సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్​గా విధులు నిర్వహించాలని ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్​ డైరెక్టర్​డాక్టర్ గోపికి స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (టీజీఎస్ఓసీఏ) డైరెక్టర్‌‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు. ఇప్పటి వరకు టీజీఎస్ఓసీఏ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ​కేశవులును అగ్రికల్చర్ వర్సిటీకి రీప‌‌ట్రియేట్ చేస్తున్నట్టు ఆదేశాలిచ్చారు. 

డాక్టర్ ​కేశవులు 2015లో  టీజీఎస్‌‌ఓసీఏ డైరెక్టర్‌‌గా నియమితులయ్యారు. అనంతరం 2016, 2020లో జారీ చేసిన జీవోల ద్వారా ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. అయితే, డాక్టర్ కేశవులు పదవీకాలం నవంబర్ 25న ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అగ్రికల్చర్ డైరెక్టర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది.