V6 News

అంబేడ్కర్ కాలేజీలో ఏఐపై జాతీయ సదస్సు

అంబేడ్కర్ కాలేజీలో ఏఐపై జాతీయ సదస్సు
  • 40 పరిశోధన పత్రాలు సమర్పించిన విద్యార్థులు

ముషీరాబాద్, వెలుగు: బాగ్​లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీలో శనివారం ‘ఏఐ డ్రైవెన్ రీసెర్చ్ మెథడాలజీ’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. సామాజిక శాస్త్రాల పరిశోధనల్లో ఏఐను ఉపయోగించి డేటాను వేగంగా విశ్లేషించడం, అంచనాలు వేయడంపై ఇందులో చర్చించారు.

సదస్సుకు హాజరైన డాక్టర్లు సురేశ్ రెడ్డి, శాంతి శ్రీ, ప్రొఫెసర్ మీసాల అప్పలయ్య మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ ప్రాధాన్యత పెరుగుతోందని, పరిశోధకులు తమ సృజనాత్మక ఆలోచనలను పంచుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు మొత్తం 40 పరిశోధన పత్రాలను ఈ సదస్సులో సమర్పించగా, వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్లు డాక్టర్ జి. యాదగిరి, డాక్టర్ శాస్త్రి, డాక్టర్ జి. ప్రభాకర్, పి. శైలజతో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు