క్వాలిఫైయర్ 2 గెలుపు గుజరాత్‌దే.. కానీ కప్పు మాత్రం ఆర్‌సీబీకే, నెట్టింట ఏఐ ప్రెడిక్షన్ వైరల్!

క్వాలిఫైయర్ 2 గెలుపు గుజరాత్‌దే.. కానీ కప్పు మాత్రం ఆర్‌సీబీకే, నెట్టింట ఏఐ ప్రెడిక్షన్ వైరల్!

RCB Champions: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) క్లైమాక్స్ రేస్ పీక్స్‌కు చేరింది. కాసేపట్లో జరగబోయే హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 మ్యాచ్, ఆ తర్వాత మే 31న జరిగే గ్రాండ్ ఫినాలే మాత్రమే ఈ సీజన్‌లో మిగిలి ఉన్నాయి. క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను దంచికొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆల్రెడీ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌ను ఓడించిన రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు గుజరాత్‌తో ఫైనల్ బెర్త్ కోసం "డూ-ఆర్-డై" పోరుకు రెడీ అయింది. 

ఐపీఎల్ ఫైనల్పై క్లాడ్ ప్రెడిక్షన్: 
ఈ క్రమంలో ఐపీఎల్ 2026 విజేత ఎవరనే దానిపై ఏఐ ప్లాట్‌ఫామ్ 'క్లాడ్' (Claude AI) ఆసక్తికర అంచనా వేసింది. ఈ రోజుల్లో ఏఐ మాయతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొన్నప్పటికీ, క్లాడ్ ఇచ్చిన ఈ క్రికెట్ ప్రెడిక్షన్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతోంది.

రాజస్థాన్‌కు షాక్.. ఫైనల్‌కు గుజరాత్: 
క్లాడ్ ఏఐ అంచనా ప్రకారం.. ఈరోజు జరిగే క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సేన పక్కా ప్లానింగ్‌తో రాజస్థాన్‌ను కట్టడి చేస్తుందని పేర్కొంది. కాగ, గుజరాత్ ఫైనల్‌కు వెళ్లినప్పటికీ, అక్కడ వారికి భంగపాటు తప్పదని ఏఐ జోస్యం చెప్పుకొచ్చింది. 

ఆర్‌సీబీదే కప్పు.. వరుసగా రెండోసారి ఛాంపియన్: 
మే 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలేలో గుజరాత్ టైటాన్స్ చతికిలపడి రన్నరప్‌తో ఇంటికి వెళ్తుందని, ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవనుందని క్లాడ్ తేల్చి చెప్పింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు గెలిచే అవకాశాలు ఏకంగా 65 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.