ఏఐ ప్లస్ కొత్త నోవా సిరీస్.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు

ఏఐ ప్లస్ కొత్త నోవా సిరీస్.. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు

హైదరాబాద్, వెలుగు: ఏఐ ప్లస్  నోవా సిరీస్‌‌ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోవా 2, నోవా 2 అల్ట్రా మోడళ్లు వచ్చే నెల తొమ్మిదో తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. నోవా 2 ప్రో, నోవా 2 నియో నోవా ఫ్లిప్ మోడళ్లు రాబోయే నెలల్లో విడుదలవుతాయి. ఫోన్ వెనుక భాగంలో లైటింగ్ మారే వినూత్న సాంకేతికత నోవా 2 అల్ట్రా ప్రత్యేకత.

గత జూలైలో ప్రారంభమైన తమ సంస్థ ఏడాదిలోపే 10 లక్షల ఫోన్లు విక్రయించి రికార్డు సృష్టించిందని ఏఐ ప్లస్​ తెలిపింది. సరసమైన ధరల్లో ప్రీమియం ఫీచర్లు అందించడమే లక్ష్యమని సీఈఓ మాధవ్ సేథ్ తెలిపారు.