Technology: వావ్ సూపర్.. హాలిడేస్ ఎంజాయి ట్రిప్.. ఏఐ టూర్‌‌‌‌ ప్లానర్‌‌‌‌.. కొత్త డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్

Technology: వావ్ సూపర్.. హాలిడేస్ ఎంజాయి ట్రిప్.. ఏఐ టూర్‌‌‌‌ ప్లానర్‌‌‌‌.. కొత్త డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్

క్రిస్మస్‌‌ సెలవుల్లో టూర్‌‌‌‌కి వెళ్లాలి అనుకుంటున్నారా.. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? ఎలా వెళ్లాలి?  అనే సందేహాలు ఉంటే ‘ట్యాసీ’ని అడగండి. తగిన సలహా ఇస్తుంది. ఇంతకీ ట్యాసీ ఎవరబ్బా! అనుకుంటున్నారా? ఇది ఒక ఏఐ అసిస్టెంట్‌‌. మన దేశంలోని ప్రముఖ ఓంనీ చానెల్ ట్రావెల్ సర్వీసెస్ కంపెనీ థామస్ కుక్ దీన్ని లాంచ్‌‌ చేసింది. 

ఇదే ఆ కంపెనీ కొత్త డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్. ఈ హాలిడే ట్రావెల్ అసిస్టెంట్ ఒక డిజిటల్ అవతార్ రూపంలో ఉంటుంది.  దీన్ని www.thomascook.in వెబ్‌‌సైట్‌‌లో చూడొచ్చు. ఇది ప్రయాణికులకు సలహాలు, హాలిడే ప్లానింగ్, బుకింగ్‌‌లో సాయం అందిస్తుంటుంది.  

ప్రయాణికులతో నేరుగా మాట్లాడుతుంది. వాళ్ల సందేహాలను విని, సమాధానాలు చెప్తుంది. వాళ్లకు ప్యాకేజీల గురించి వివరిస్తుంది. అంతేకాదు ఇది ప్రయాణికులకు ఆకర్షణీయమైన, ఇంటరాక్టివ్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఇస్తుంది. ట్యాసీ గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు ఈ కంపెనీ ఏఐ -జనరేటెడ్ వీడియోల సిరీస్‌‌ను కూడా విడుదల చేసింది.

–వెలుగు, లైఫ్​–