అన్నాడీఎంకేలో చీలిక..30 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి!

అన్నాడీఎంకేలో చీలిక..30 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి!
  • టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతున్న 30 మంది ఎమ్మెల్యేలు
  • వ్యతిరేకిస్తున్న మరో వర్గం

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఆగిపోయిన విజయ్  పార్టీ(టీవీకే)కి మద్దతు ఇచ్చి, ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో దాదాపు 30 మంది ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ అంశంలో అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం పళనిస్వామికి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి సీవీ షణ్ముగం కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పళనిస్వామి తొలుత టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు ప్రకటించినప్పటికీ, పార్టీలోని కీలక నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి వెళ్లడమే ఉత్తమమని భావిస్తున్నారు.

బీజేపీ నాయకత్వం పావులు!

కాంగ్రెస్ మద్దతుతో టీవీకే పార్టీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడానికి, అన్నాడీఎంకే ద్వారా విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇప్పించేలా బీజేపీ నాయకత్వం కూడా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెర్తులు కూడా దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. విజయ్ రాజకీయాలకు కొత్త కాబట్టి, అనుభవం ఉన్న తమ పార్టీ నేతలు ప్రభుత్వంలో ఉంటే బాగుంటుందని వారు వాదిస్తున్నట్లు సమాచారం. ఇదే పార్టీలో మరో వర్గం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

మెట్టు దిగకపోతే పార్టీ చీలే ప్రమాదం

టీవీకేతో కలిసేందుకు పళనిస్వామి మెట్టు దిగకపోతే అన్నాడీఎంకే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల కోరిక మేరకు పళనిస్వామి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ నాయకుడు తెలిపారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి, టీవీకేతో కలవడానికి ఇదే సరైన సమయమని కొందరు నాయకులు భావిస్తున్నారు. పొత్తు విషయంలో టీవీకేతో చర్చలు జరుగుతున్నాయని అన్నాడీఎంకే నాయకురాలు లీమా రోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. 

డెసిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్ చేతుల్లోనే: కోవై సత్యన్

తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు మద్దతిచ్చే అంశంపై అన్నాడీఎంకే నేత కోవై సత్యన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బంతి విజయ్ కోర్టులోనే ఉంది. రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఉంది.మద్దతుపై తుది నిర్ణయం అన్నాడీఎంకే హైకమాండ్ మాత్రమే తీసుకుంటుంది" అని స్పష్టం చేశారు. అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు ఉన్నాయని.. పార్టీ చీలిపోయే అవకాశం ఉందన్న వార్తలను కోవై సత్యన్ ఖండించారు.

 ‘‘పార్టీ విడిపోయే ప్రసక్తే లేదు. అందరం ఏకాభిప్రాయంతో ఉన్నాం. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు హైకమాండ్ అడుగులు వేస్తుంది’’ అని పేర్కొన్నారు. తమకు టీవీకే అధికారిక లేఖ అందలేదని వివరించారు.