క్రాస్ ఓటింగ్ రచ్చ.. అన్నా డీఎంకేనుంచి షణ్ముగంతో సహా..13 మంది ఎమ్మెల్యేల బహిష్కరణ

క్రాస్ ఓటింగ్ రచ్చ.. అన్నా డీఎంకేనుంచి షణ్ముగంతో సహా..13 మంది ఎమ్మెల్యేల బహిష్కరణ

తమిళనాడు రాజకీయాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలనిరూపణ సమయంలో క్రాస్ ఓటింగ్ జరగడంతో అన్నా డీఎంకే పార్టీ తిరుగు బాటు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంది. అన్నాడీఎంకేలో సీనియర్ నేత షణ్ముగం,13 ఎమ్మెల్యేలతో సహా మొత్తం 29 మంది నేతలను పార్టీ నుంచి  బహిష్కరించింది. 

షణ్ముగం, వేలుమణితో పాటు, ఆర్. కామరాజ్, సి. విజయభాస్కర్, తంగమణి, కేపీ. అన్బళగన్, కేసీ. వీరమణి, ఎంఆర్. విజయభాస్కర్ వంటి పలువురు సీనియర్ ఏఐఏడీఎంకే నేతలను వారి పదవుల నుంచి ఆ పార్టీ చీఫ్ పళనిస్వామి తొలగించారు. బుధవారం (మే 13) అసెంబ్లీలో బలనిరూపణ జరగగా విజయ్ కి మద్దతులు షణ్ముగంతోసహా 25అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటు వేశారు.దీంతో విజయ్ ప్రభుత్వం బలం 144కు పెరిగింది.  

అసెంబ్లీలో ఈపీఎస్ వర్సెస్ రెబెల్స్..

ఇదిలా ఉండగా టీవీకే అధినేతకు అనుకూలంగా ఓటు వేసేందుకు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవులు ఆఫర్ చేశారని పళనిస్వామి ఆరోపించడంతో సీఎం విజయ్ ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో హై డ్రామా చోటుచేసుకుంది.విజయ్‌కు మద్దతుగా ప్రవేశపెట్టే తీర్మానాన్ని 47 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారని పళనిస్వామి ప్రకటించగా తిరుగుబాటు నేత వేలుమణి బహిరంగంగానే విజయ్ కి మద్దతు ప్రకటించారు.