తెలంగాణ సర్కార్ రైతు రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మకం: ఖర్గే

తెలంగాణ సర్కార్ రైతు రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మకం: ఖర్గే

తెలంగాణ సర్కార్ రైతు రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు.. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. పదహారేళ్ల క్రితం కాంగ్రెస్ నాయకత్వంలోని UPA సర్కార్.. 72వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిందని గుర్తు చేశారు. దేశంలోని కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు.. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ మాత్రం నల్ల చట్టాలతో అన్నదాతలను వేధిస్తోందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు 2022 మేలో తెలంగాణ పర్యటనలో రాహుల్ ప్రసంగాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ మాట ఇస్తే తప్పదని, వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌ గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ రైతాంగానికి ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తామని తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని, అందులో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు.