ఇడుక్కి: క్రైస్తవ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలపై దాడి చేసేందుకే ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని (ఎఫ్సీఆర్ఏ) సవరించాలని చూస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్సీఆర్ఏ సవరణలు బీజేపీ, మోదీ అసలు నైజాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు.
ఈ మేరకు ఆదివారం కేరళలోని ఇడుక్కి అసెంబ్లీ నియోజకర్గంలో జరిగిన యూడీఎఫ్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇది సంస్కరణ ఎంతమాత్రం కాదు. క్రైస్తవ విద్యా, వైద్య సంస్థలు, ఎన్జీవోలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడి. క్రైస్తవ సంస్థల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు’’ అని విమర్శించారు.
