టీపీసీసీ సోషల్ మీడియా అధ్యక్షుడిగా మన్నె సతీష్

టీపీసీసీ సోషల్ మీడియా అధ్యక్షుడిగా మన్నె సతీష్

న్యూఢిల్లీ: టీపీసీసీ సోషల్ మీడియా కమిటీని ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ గా మన్నె సతీష్ నిమితులయ్యారు. పట్టెం నవీన్ , నరేళ్ల వపన్ కుమార్ , సింధు శంకర్, రఘురాం రెడ్డిలను రాష్ట్ర కోఆర్డినేటర్లుగా, కైరా ఉజ్వల్ రెడ్డిని కో కోఆర్డినేటర్ గా  నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

తక్షణమే వాళ్ల నియామకం అమల్లోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వారంతా సోషల్ మీడియా వేదిక ద్వారా కృషి చేయనున్నారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇక కొత్తగా నియమితులైన సోషల్ మీడియా ప్రతినిధులకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.