రాహుల్ గాంధీ అమెరికా టూర్ ముగిసిన వెంటనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరుతారని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. కోదండరాంతో కలిసి జూపల్లి ఇంటికి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు వెళ్లారు సంపత్. అనంతరం మాట్లాడిన ఆయన .. ఖమ్మంలో పొంగులేటి, మహబూబ్ నగర్ లో జూపల్లి విడివిడిగా సభలు పెట్టి కాంగ్రెస్ లో చేరుతారని చెప్పారు. జూపల్లి చెప్పిన అభ్యంతరాలకు క్లారిటీ ఇచ్చానన్నారు. ఏఐసీసీ ఆదేశాలతోనే జూపల్లితో చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
కోదండారం కూడా ఈ మీటింగ్ కు వచ్చారని.. తన పార్టీ విలీనం, కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం అంశాలపై చర్చించామని సంపత్ తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన లోపాలను కోదండరాం గుర్తు చేశారని..మళ్లీ అలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చానన్నారు. రేవంత్ ఆలోచన విధానం కోదండరాంకు వివరించామన్నారు. అధికార బీఆర్ఎస్ ను గద్దె దించడం కోసం కోదండరాం అన్ని వర్గాలను కలుపుకొని వస్తానన్నారని సంపత్ చెప్పారు.

