పేద విద్యార్థుల చదువులకు సాయం: తెలంగాణ ఫుడ్స్​ చైర్మన్​

పేద విద్యార్థుల చదువులకు సాయం: తెలంగాణ ఫుడ్స్​ చైర్మన్​

హైదరాబాద్, వెలుగు: ఇద్దరు పేద విద్యార్థినుల ఉన్నత చదువుల ఫీజులు చెల్లించేందుకు తెలంగాణ ఫుడ్స్​ చైర్మన్​ మేడె రాజీవ్​సాగర్​ ముందుకు వచ్చారు. మంత్రి కేటీఆర్ ​జన్మదినం సందర్భంగా గిఫ్ట్​ఏ స్మైల్​లో భాగంగా వారిద్దరికి రూ.లక్ష చొప్పున చెక్కులు ఆదివారం అందజేశారు. ఎంజీ వర్సిటీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్​ కెమిస్ట్రీ చదువుతున్న కొమ్ము సుమతి, మీర్​పేటలోని టీకేఆర్​ కాలేజీలో బీటెక్ ​చదువుతున్న మల్లెపాక శ్వేత చదువు పూర్తయ్యేవరకు రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తానని ​తెలిపారు. పేదరికం వల్ల చదువుకు దూరం కావొద్దనే వారి ఫీజులు చెల్లిస్తున్నానని తెలిపారు.