హార్ట్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ఏఐజీ హాస్పిటల్లో పీఎఫ్ఏ టెక్నాలజీ

హార్ట్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ఏఐజీ హాస్పిటల్లో పీఎఫ్ఏ టెక్నాలజీ

హైదరాబాద్​, వెలుగు:  దేశంలోనే మొదటిసారిగా పల్స్ ​సెలెక్ట్​ పల్స్​ ఫీల్డ్​ అబ్లేషన్​ (పీఎఫ్​ఏ) ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్టు హైదరాబాద్​లోని ఏఐజీ హాస్పిటల్​ ప్రకటించింది.  ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (ఏఎఫ్​) ఉన్నవారిలో గుండె పై గదులు గందరగోళంగా, చాలా వేగంగా కొట్టుకుంటాయి. ఈ సమస్యను సరిచేయడానికి వైద్యులు చేసే ప్రక్రియే అబ్లేషన్ . 

ప్రస్తుతం అబ్లేషన్ కోసం గుండెలోని కణజాలాన్ని వేడి చేయడం లేదా గడ్డకట్టేంత చల్లబరుస్తున్నారు. ఇది సమర్థవంతమే అయినా, ఒక్కోసారి పక్కనే ఉన్న అవయవాలకు గాయం అయ్యే చిన్న ప్రమాదం ఉండేది. పీఎఫ్​ఏ వేడిని లేదా చలిని ఉపయోగించదు.  చాలా వేగంగా పనిచేసే  విద్యుత్ తరంగాలను పంపిస్తుంది. ఇది గుండెలోని అసాధారణ లయకు కారణమయ్యే కణజాలాన్ని మాత్రమే  లక్ష్యంగా చేసుకుంటుందని ఏఐజి  డాక్టర్​ నరసింహన్​ వివరించారు.