పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికి ఆధారాల్లేవ్

పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికి ఆధారాల్లేవ్

చిన్నపిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికి ఆధారాలేమీ లేవన్నారు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా. అనేక దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ నడుస్తోందన్నారు. ఆ దేశాల్లో కూడా పిల్లలపై ప్రభావం ఉన్నట్టు డేటా ఏమీ లేదన్నారు. సెకండ్ వేవ్ టైమ్ లో మనదేశంలో అనేకమంది చిన్నపిల్లలకు కరోనా సోకినప్పటికీ... పెను ప్రభావాలేమీ కాలేదన్నారు. వారంతా స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని, కోమోర్బిడిటీస్ కనిపించాయని చెప్పారు. భవిష్యత్ వేవ్స్ లోనూ పిల్లలకు సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని తాను అనుకోవడంలేదన్నారు రణ్ దీప్ గులేరియా.