కేదార్‌నాథ్‌లో అంబులెన్స్ హెలికాప్టర్ ప్రమాదం..వెనక భాగం విరిగి కూలింది

కేదార్‌నాథ్‌లో అంబులెన్స్ హెలికాప్టర్ ప్రమాదం..వెనక భాగం విరిగి కూలింది

ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది.  కేదారీనాథ్ లో శనివారం (మే17) ఎయిమ్స్ రిషికేష్ హెలీ అంబులెన్స్ సర్వీస్ కు చెందిన హెలీకాప్టర్ వెనుకభాగం విరిగిపోవడంతో అత్యసవర ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణించేవారు సురక్షితంగా బయటపడ్డారు. కేదారీనాథ్ లో ఈ హెలీకాప్టర్ ను అత్యవసర వైద్య సేవలకు వినియోగించినట్లు తెలుస్తోంది.  ఎత్తయిన ప్రాంతానికి వెళ్తుండగా హెలీకాప్టర్ వెనకభాగం విరిగిపోయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ హెలీకాప్టర్ లో ప్రయాణిస్తున్న - పైలట్ (కెప్టెన్), డాక్టర్, వైద్య సిబ్బంది ఒకరు - సురక్షితంగా బయటపడ్డారు. 

ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.. పైలట్, ఆన్ బోర్డు సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల ప్రాణనష్టం జరగలేదని గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే చెప్పారు. 

►ALSO READ | ఇంత దారుణమా.. సిగరెట్ ఇవ్వలేదని సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కారుతో గుద్ది చంపాడు

కేదార్‌నాథ్‌లో పేషెంట్ కోసం హెలి-అంబులెన్స్ వెళ్లిందని, ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ దెబ్బతిందని తెలిపారు. హెలికాప్టర్ వెనుక భాగం దెబ్బతిన్నట్లు చూపించే వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ ప్రమాదం మే నెలలో రెండోది. మే 8న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఏడు సీట్ల హెలికాప్టర్ గంగోత్రి సమీపంలో కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా ఒకరు గాయపడ్డారు.