ఇంత దారుణమా.. సిగరెట్ ఇవ్వలేదని సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కారుతో గుద్ది చంపాడు

ఇంత దారుణమా.. సిగరెట్ ఇవ్వలేదని సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కారుతో గుద్ది చంపాడు

కొందరిలో అసహనం ఏ స్థాయిలో ఉంటుంది అంటే.. చిన్న కారణానికే ప్రాణం తీసే వరకు.. ప్రాణం పోతే మళ్లీ తిరిగి రాదని తెలిసీ కూడా.. అహంకారంతో ప్రవర్తిస్తూ ఇతరుల జీవితాను నాశనం చేస్తుంటారు. అలంటి ఘటనే ఇది. కేవలం సిగరెట్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో.. మంచి ఫ్యూచర్ ఉన్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను బలితీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంజయ్, చేతన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ సాఫ్ట్ వేర్ ఇంజీనర్లు నైట్ షిఫ్ట్ లో ఉన్నారు. రిలాక్స్ కోసం ఉదయం నాలుగు గంటలకు బయటకు వచ్చారు. టీ తాగుతున్న టైమ్ లో ప్రతీక్ అనే వ్యక్తి కారులో భార్యతో పాటు వచ్చిన వ్యక్తి సిగరెట్ ఇవ్వమని అడిగాడు. ఇక్కడే సిగరెట్స్ ఉన్నాయి.. కొనుక్కోవచ్చుకదా అని అనటంతో.. వాళ్లతో వాగ్వాదానికి దిగాడు ఆ వ్యక్తి. మాటకు మాట లొల్లి పెద్దది కావడంతో అక్కడే ఉన్న కొందరు కూల్ చేశారు. అంతే జరిగింది.. అంతకు మించి ఏం లేదు.. ఈ మాత్రం దానికే అసహనంతో ఊగిపోయాడు ఆ దుర్మార్గుడు.

►ALSO READ | Robbery: 'సీతారామం' నటి కారులో భారీ చోరీ.. ఖరీదైన ఆభరణాలను దొంగిలించిన క్యాబ్ డ్రైవర్

వాళ్లతో గొడవకు దిగి.. స్థానికులు ఆపడంతో ఆగిపోయిన ఆ వ్యక్తి.. నాకే ఎదురు చెపుతారా..? నాతోనే వాదిస్తారా అనే అహంకారంతో.. విచక్షణ మరిచి ప్రవర్తించాడు. తన పవరేంటో చూపిస్తానంటూ వాళ్లను వెనక నుంచి ఫాలో అయ్యాడు. యూ టర్న్ తీసుకుంటున్న టైమ్ లో వేగంగా వెళ్లి వెనుక నుంచి బలంగా డ్యాష్ ఇచ్చాడు. ముందు గోడ ఉండటంతో కారుకు గోడకు మధ్య నలిగి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 

ఆస్పత్రికి తీసుకెళ్లగా తీవ్ర గాయాలతో రెండు రోజుల తర్వాత సంజయ్ చనిపోయాడు. చేతన్ చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. ఫూటేజ్ ఆధారంగా మర్డర్ కేసు నమోదు చేశారు పోలీసులు.