కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు అందుకున్న ఐలయ్య

కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు అందుకున్న ఐలయ్య

గంగాధర, వెలుగు:  మండలంలోని ర్యాలపల్లికి చెందిన ఒగ్గరి ఐలయ్య  శనివారం    కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు.  ఆజాది కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా  ఢిల్లీలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​కర్​ , కేంద్ర మంత్రులు అరుణ్ మేగ్వాల్, మీనాక్షి లేఖి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ సంధ్య పురేచా చేతులమీదుగా ఐలయ్య శనివారం తామ్రపత్రం, రూ.లక్ష, అవార్డు అందుకున్నారు.  

ALSO READ:  వినాయక చవితి.. విఘ్నేశ్వరుని కథ వినాల్సిందే..

పేదరికంతో కుటుంబాన్ని పోషించుకోవడమే ఇబ్బందిగా మారిన నాటి రోజుల్లో ఒగ్గు కథ చెప్పడమే తన జీవనోపాధిగా ఎంచుకున్నారు.  సుమారు 60 ఏండ్లపాటు ఆయన  ఒగ్గు కథలు చెప్పారు.