రౌడీషీటర్ హత్య వెనుక.. జల్​పల్లి మున్సిపల్ చైర్మన్

రౌడీషీటర్ హత్య వెనుక.. జల్​పల్లి మున్సిపల్ చైర్మన్
  • ఆయనతో పాటు మరో ముగ్గురి అరెస్టు
  • యూట్యూబ్‌‌‌‌లో తనకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడని కక్ష
  • గేను ఎరగా వేసి మరో రౌడీషీటర్​తో కలిసి మర్డర్​కు ప్లాన్ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట బండ్లగూడలో జరిగిన రౌడీ షీటర్  బవజీర్‌‌‌‌‌‌‌‌  హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో జల్‌‌‌‌పల్లి  మున్సిపల్‌‌‌‌  చైర్మన్‌‌‌‌తో పాటు మరో ముగ్గురిని బుధవారం అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బవజీర్  హత్యకు గే కారణమని గుర్తించారు. కేసు వివరాలను సౌత్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌  జోన్‌‌‌‌  డీసీపీ రూపేశ్  వెల్లడించారు. బండ్లగూడ పీఎస్‌‌‌‌  పరిధిలో ఈ నెల 10న రాయల్‌‌‌‌ సీ హోటల్‌‌‌‌ దగ్గర్లో బఫ్లెమ్  బిల్డింగ్  ఫస్ట్‌‌‌‌  ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని బార్కస్‌‌‌‌కు చెందిన రౌడీషీటర్  షేక్ సయీద్  బిన్  అబ్దుల్  రహమాన్  బవజీర్ (27) గా గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. బవజీర్​ హైదరాబాద్‌‌‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మూడు పోక్సో కేసులతో పాటు మరో 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2021లో చంచల్‌‌‌‌గూడ జైలులో రిమాండ్‌‌‌‌ ఖైదీగా ఉన్నపుడు అక్కడే ఉన్న సుల్తాన్  షాహీకి చెందిన రౌడీ షీటర్‌‌‌‌‌‌‌‌  అహ్మద్‌‌‌‌  బిన్‌‌‌‌  హజీబ్‌‌‌‌ (20)తో పరిచయం ఏర్పడింది. అహ్మద్‌‌‌‌ బిన్‌‌‌‌ హజీబ్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌లోని వివిధ పోలీస్‌‌‌‌ స్టేషన్లలో ఆరు కేసుల్లో నిందితుడు. జైలు నుంచి బయటికొచ్చాక ఇద్దరు గేలుగా మారారు. ఈ క్రమంలో హజీబ్‌‌‌‌  ఫ్రెండ్స్‌‌‌‌ను కూడా తీసుకురావాలని బవజీర్‌‌‌‌‌‌‌‌  బలవంతం చేశాడు. ‌‌‌‌దీంతో సుల్తాన్ షాహీకి చెందిన మహ్మద్‌‌‌‌  ఆయూబ్ ఖాన్‌‌‌‌ (20)ను హజీబ్ తీసుకొచ్చాడు. ఆయూబ్ ఖాన్‌‌‌‌పై బవజీర్  లైంగిక దాడి చేసేందుకు యత్నించగా ఆయూబ్  ప్రతిఘటించాడు. బవజీర్‌‌‌‌‌‌‌‌ యూట్యూబ్  చానెల్  నిర్వహించాడు. బండ్లగూడలో చానెల్ ఆఫీస్  ఓపెన్  చేసి జల్‌‌‌‌పల్లి మున్సిపల్  చైర్మన్‌‌‌‌  అబ్దుల్లా సాదీకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టాడు. దీంతో అబ్దుల్లా సాదీతో పాటు ఆయన కుమారుడు అహ్మద్  సాదీ.. బవజీర్‌‌‌‌‌‌‌‌పై కక్ష పెంచుకున్నారు. హజీబ్‌‌‌‌, బవజీర్‌‌‌‌‌‌‌‌  మధ్య ఉన్న హోమో సెక్స్‌‌‌‌  సంబంధం గురించి తెలుసుకున్నారు. ఇదే అవకాశంగా హజీబ్‌‌‌‌, ఆయూబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌కు రూ.13 లక్షలు ఆఫర్ చేసి బవజీర్​ను చంపాలని సుపా రీ ఇచ్చారు. అబ్దుల్లా సాదీ కుటుంబ సభ్యులైన సాలే సాదీ, ఉమర్ సాదీ సహా మొత్తం ఆరుగురు కలిసి బవజీర్ హత్యకు స్కెచ్‌‌‌‌ వేశారు. హత్య కోసం హజీబ్  కత్తి కొనుగోలు చేశాడు.

ఇలా హత్య చేశారు

గతంలో బవజీర్‌‌‌‌‌‌‌‌తో కలిసిన హజీబ్  బంధువు సౌద్‌‌‌‌ను తీసుకువస్తున్నట్లు బవజీర్​కు ఆయూబ్  ఖాన్  తెలిపాడు.10వ తేదీ రాత్రి హబీబ్‌‌‌‌, సౌద్, ఆయూబ్‌‌‌‌  ఖాన్‌‌‌‌ రెండు బైక్‌‌‌‌లపై బయలుదేరారు. మార్గం మధ్యలో కారంపొడి కొన్నారు. రాత్రి 11.-40 గంటలకు బవజీర్‌‌‌‌‌‌‌‌ యూట్యూబ్ ఆఫీస్‌‌‌‌కు చేరుకున్నారు. ఆయూబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ ఆఫీస్  బయట కాపలా ఉన్నాడు. హజీబ్‌‌‌‌, సౌద్‌‌‌‌  లోపలికి వెళ్లారు. హబీబ్‌‌‌‌  బయట ఉండగా.. సౌద్‌‌‌‌తో బవ జీర్  అసహజ లైంగిక చర్యలో పాల్గొన్నాడు. అప్ప టికే కాపుకాసి ఉన్న హబీబ్‌‌‌‌.. బవజీర్‌‌‌‌‌‌‌‌  కళ్లలో కారం చల్లి కత్తితో దాడిచేసి చంపాడు. తర్వాత ఆయూబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, సౌద్‌‌‌‌తో కలిసి పారిపోయాడు. అబ్దుల్లా సాదీ, ఆయన కుమారుడు అహ్మద్ సాదీ, హజీబ్‌‌‌‌, ఆయూబ్‌‌‌‌ఖాన్‌‌‌‌ను అరెస్టు చేశారు.