
కొత్త తరహా కాన్సెప్టులు,డిఫరెంట్ రోల్స్‌తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్(Satyadev)..ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘కృష్ణమ్మ’(Krishnamma) మూవీ ఒకటి.కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వి. వి. గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు.
ఈ మూవీ మే 10న రిలీజ్ కానుంది.ఈ తరుణంలో మే 1న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. హైదరాబాద్‍లోని హైటెక్ సిటీ ట్రైడెంట్ హౌటల్‍లో ఈ ఈవెంట్ జరగనుంది. అయితే, ఈ ఈవెంట్‍కు ఏకంగా ఐదుగురు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ముఖ్య అతిథిలుగా రానుండడం మరింత ఇంట్రెస్టింగ్‍గా మారింది.
గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే, స్టార్ డైరెక్టర్లు సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని కూడా చీఫ్ గెస్టులుగా కృష్ణమ్మ కోసం రానున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది గ్రాండెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అని కృష్ణమ్మ మేకర్స్ పోస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితిలో ఈ గ్రాండ్ ఈవెంట్ను సినీ లవర్స్ మిస్ అవ్వకండి.
The stars have aligned for #Krishnamma and so have the blockbuster directors of Telugu Cinema ❤️?
— Mythri Movie Makers (@MythriOfficial) April 29, 2024
Catch them at the GRANDEST PRE-RELEASE EVENT OF TELUGU CINEMA on May 1st ✨
▶️ https://t.co/3AYZQLUVkf#Krishnamma GRAND RELEASE ON ??? ???? by @MythriReleases &… pic.twitter.com/rIWYB6UWAl
ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను భారీ స్థాయిలో మే 10న రిలీజ్ చేస్తున్నాయి.
ఈ మూవీ కథ విషయానికి వస్తే..
విజయవాడ నగరంలో కృష్ణనది పక్కన ఉండే ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్‌కి, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ‘కృష్ణమ్మ’ సినిమా కథ. ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎలా పుట్టామో ఎవరికీ తెలీదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా పుట్టిన ప్రతివాడికీ ఏదో ఓ కథ ఉండే ఉంటుంది. కథ నడక, నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ కెలకకూడదు. ఎలాంటి సంఘటన ముగ్గురి జీవితాల్ని మలుపు తిప్పింది? ఈ క్రమంలో వీరికి ఎదురైన సవాళ్లేంటి? అన్నది థియేటర్‌లో చూడాల్సిందే.