తెలంగాణ ప్రజల చూపు బీజేపీ వైపు : పొంగులేటి సుధాకర్ రెడ్డి

తెలంగాణ ప్రజల చూపు బీజేపీ వైపు : పొంగులేటి సుధాకర్ రెడ్డి
  • బీజేపీ జాతీయ నేత  పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని మాజీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్’ దార్శనికతపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకమే దీనికి కారణమని పేర్కొన్నారు. 

ఆదివారం జూబ్లీహిల్స్​లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా సుధాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న సుపరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆయన వెంట పార్టీ నేతలు రామలింగేశ్వర రావు, త్రిలోక్ రెడ్డి,  చంద్రశేఖర్, విజయ లక్ష్మి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.