న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 12.06 గంటలకు ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూమికి 90 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది.
అయితే, జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ మాత్రం.. భూకంప తీవత్ర 6.07గా నమోదైనట్టు పేర్కొంది. భూమికి 90కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని చెప్పింది. ఈ భూకంపం ధాటికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు.
