నేతకానీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి: వివేక్ వెంకటస్వామి

నేతకానీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి:  వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా: చెన్నూర్ పట్టణంలోని ఎమ్మార్‌ఆర్ ఫ్యాంక్షన్ హాల్‌లో నేతకానీ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. నేతకాని సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. వంశీ కృష్ణని గెలిపిస్తే కేంద్రంలో కూడా మాట్లాడి నిధులు సమీకరించొచ్చని ఆయన చెప్పారు. తర్వలోనే హైదరాబాద్, చెన్నూర్ లలో నేతకాని భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

ఐదు సంవత్సరాలుగా చెన్నూర్ నియోజకర్గంలో అనేక మంచి పనులు చేస్తానని, నీటి ఎద్దడి తీర్చడానికి వందలాది బోర్లు వేశామన్నారు. బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ అని, పది సంవత్సరాలుగా బీజేపీ ఒక్క స్కీం కూడా ప్రజలకు అమలు చేయలేదని చెన్నూర్ ఎమ్మెల్యే అన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని ఆరోపించారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి దళిత రాష్ట్రపతిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. వంశీ కృష్ణ కాకా బాటలో ప్రజాసేవా చేయడానికి ఎంపీగా పోటీ చేస్తున్నాడని అన్నారు.