ఫైనల్‌‌పై గురి.. బంగ్లాదేశ్‌ Aతో ఇండియా- A సెమీస్‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌

ఫైనల్‌‌పై గురి.. బంగ్లాదేశ్‌ Aతో ఇండియా- A సెమీస్‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌

దోహా: లీగ్‌ దశలో సూపర్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన ఇండియా–ఎ జట్టు.. రైజింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్స్‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో సెమీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌–ఎతో తలపడనుంది. యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషనల్‌‌‌‌‌‌‌‌ వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో మెరుపులు మెరిపిస్తున్నా.. మిగతా టాప్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు కెప్టెన్‌‌‌‌‌‌‌‌ జితేష్‌‌‌‌‌‌‌‌ శర్మ, సమన్ ధీర్‌‌‌‌‌‌‌‌, ప్రియాంశ్ ఆర్యా, నేహల్‌‌‌‌‌‌‌‌ వాధెరా గాడిలో పడాల్సి ఉంది. వీళ్లు రాణించి భారీ టార్గెట్‌ నిర్దేశిస్తేనే బంగ్లాను కట్టడి చేసేందుకు బౌలర్లకు అవకాశం లభిస్తుంది.

ఒకవేళ చిన్న జట్టే అని బంగ్లాను తేలికగా తీసుకుంటే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే అల్లా గజన్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌, సెదికుల్లా అటల్‌‌‌‌‌‌‌‌తో కూడిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను 78 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేసిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌.. చివరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ శ్రీలంకను వణికించింది. దీనికి తోడు సీనియర్‌‌‌‌‌‌‌‌ జట్టులో ఆడిన పేసర్‌‌‌‌‌‌‌‌ రిపాన్‌‌‌‌‌‌‌‌ మోండోల్‌‌‌‌‌‌‌‌, లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రకీబుల్‌‌‌‌‌‌‌‌ జట్టులోకి రావడం బంగ్లా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ మరింత  బలంగా మారింది.