హైదరాబాద్ లో ORR దగ్గర  అగ్నిప్రమాదం..  ఎయిర్ ఇండియా బస్సులో మంటలు..

హైదరాబాద్ లో ORR దగ్గర  అగ్నిప్రమాదం..  ఎయిర్ ఇండియా బస్సులో మంటలు..

హైదరాబాద్ లో పెద్ద అంబర్ పేట్ ORR దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంగళవారం ( మే 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీసు రోడ్డు దగ్గర జరిగింది ఈ ప్రమాదం. శంషాబాద్ నుండి పెద్ద  అంబర్ పేట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్దమైంది.

బస్సులో భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.  బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో వాహనాల్లో మంటలు చెలరేగే అవకాశం ఉందని.. వాహనదారులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు అధికారులు.